'వాళ్ల గొడ్డవలన్నీ సిల్లీ థింగ్స్' : సునీతా విలియమ్స్ సంచలన వ్యాఖ్యలు

by Muthe.Rajitha |

ప్రముఖ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.

వాళ్ల గొడ్డవలన్నీ సిల్లీ థింగ్స్ : సునీతా విలియమ్స్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సునీతా విలియమ్స్.. 'ఐస్ ఆన్ స్టార్స్, ఫీట్ ఆన్ ది గ్రౌండ్' అనే అంశంపై మాట్లాడారు. అలాగే పలు విషయాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు. అంతరిక్షయానం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని పేర్కొన్నారు. అంతరిక్షం నుంచి భూమిని చూసినప్పుడు జీవితం పట్ల తన ఆలోచనలు మారిపోయాయని.. మనుషులు చిన్న చిన్న విషయాలపై గొడవలు పడటం చాలా సిల్లీగా అనిపిస్తుందని పేర్కొన్నారు. అంతరిక్షానికి వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ తమ ఇల్లు ఎక్కడుందో చూడాలని ప్రయత్నిస్తారని చెప్పారు. తన తండ్రి భారత్‌కు చెందినవారు, తల్లి స్లోవేనియాకు చెందినవారు కావడంతో మొదట ఆ ప్రాంతాలనే వెతికానని తెలిపారు.

కానీ చివరకు భూమి మొత్తం ఒక్కటేనని అర్థమైందన్నారు. సముద్రాలు, ఋతువులు, ధృవాలు అన్నీ అంతరిక్షం నుంచి చాలా అద్భుతంగా కనిపిస్తాయని, అలా భూమిని చూసినప్పుడు మన ఆలోచనా విధానం పూర్తిగా మారుతుందని చెప్పారు. మనమంతా ఒక్కటే అన్న భావన కలుగుతుందని, కలిసి జీవించాలి అనే ఆలోచన వస్తుందని తెలిపారు. నాసాలో దాదాపు 30 సంవత్సరాలు పనిచేసిన సునీతా విలియమ్స్.. మూడు సార్లు అంతరిక్షయానం చేసి, మొత్తం 608 రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపారు. అనేకసార్లు స్పేస్ వాక్ నిర్వహించారు.

Next Story