- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కీలక పరిణామం.. బారామతి ఉప ఎన్నిక బరిలో సునేత్ర పవార్
బారామతి అసెంబ్లీ ఉపఎన్నికకు సునేత్రా పవార్ నామినేషన్! కూటమి నేతల సమక్షంలో ఎస్‌డీఎం కార్యాలయంలో పత్రాల సమర్పణ.

దిశ, వెబ్ డెస్క్: ఉప ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ సోమవారం బారామతి అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. బారామతిలోని ఎస్‌డీఎం (SDM) కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి ఆమె తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె వెంట కూటమికి చెందిన పలువురు ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు నిర్వహించిన ర్యాలీలో సునేత్ర పవార్ ఉత్సాహంగా పాల్గొని, బారామతి అభివృద్ధికి తమ కుటుంబం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
పవార్ కుటుంబానికి కంచుకోటగా భావించే బారామతిలో ఈ ఉపఎన్నిక ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత లోక్‌సభ ఎన్నికల్లో సుప్రియా సూలేపై పోటీ చేసి ఓటమి పాలైన సునేత్ర పవార్, ఇప్పుడు అసెంబ్లీ బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అజిత్ పవార్ వర్గానికి ఈ గెలుపు ప్రతిష్టాత్మకం కావడంతో, క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మరోవైపు శరద్ పవార్ వర్గం కూడా ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తోంది. పవార్ కుటుంబ సభ్యుల మధ్య మరోసారి హోరాహోరీ పోరు సాగనున్న నేపథ్యంలో, బారామతి ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.






