మహారాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్.. ప్రధాని మోడీ ప్రత్యేక అభినందనలు

by Malleboina Mahesh |

బారామతి విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

మహారాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్.. ప్రధాని మోడీ ప్రత్యేక అభినందనలు
X

దిశ, వెబ్ డెస్క్: బారామతి విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ను నిలబెట్టాలని కూటమి, ఎన్సీపీ నేతలు నిర్ణయించారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. రాష్ట్ర చరిత్రలో తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ ఈ రోజు సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమెకు ఎక్స్(twitter) వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళగా ఆమె రికార్డు సృష్టించడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.

అలాగే మహారాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సునేత్ర పవార్ అవిశ్రాంతంగా కృషి చేస్తారని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. దివంగత అజిత్ దాదా పవార్ (Late Ajitdada Pawar) కన్న కలలను, ఆయన ఆశయాలను ఆమె నిలబెడతారని, మహారాష్ట్ర అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Next Story