మెహిదీపట్నం పోలీస్ స్టేషన్‌లో నగర సీపీ సజ్జనార్ ఆకస్మిక తనిఖీ

by Kodari Anjali |

నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ బుధవారం ఉదయం మెహిదీపట్నం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మెహిదీపట్నం పోలీస్ స్టేషన్‌లో నగర సీపీ సజ్జనార్ ఆకస్మిక తనిఖీ
X

దిశ, కార్వాన్: నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ బుధవారం ఉదయం మెహిదీపట్నం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 10:30 గంటల ప్రాంతంలో పిఎస్‌కు చేరుకున్న సీపీ, సుమారు రెండు గంటల పాటు అక్కడే ఉండి పిఎస్ పనితీరును, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బందితో మాట్లాడి, రికార్డులు, రిసెప్షన్ నిర్వహణ, పెండింగ్ కేసులు మరియు బాధితుల ఫిర్యాదుల పరిష్కారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేసి అక్కడ నుండి వెళ్లిపోయారు.

Next Story