- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ.. ఆకట్టుకుంటోన్న స్పెషల్ పోస్టర్
కథ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా పేరు తెచ్చుకున్న ధీరజ్ మొగిలినేని

దిశ, సినిమా: కథ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా పేరు తెచ్చుకున్న ధీరజ్ మొగిలినేని.. ఇప్పడు తన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై తీసుకొస్తోన్న మూవీ ‘సమ్మర్ హాలిడేస్’. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టులు రోహాన్, అరుణ్, బేబి ఖుషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో 'సమ్మర్ హాలిడేస్' గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వస్తుండగా.. తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో సీనియర్ నటి జయసుధ అమ్మమ్మ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె పాత్రను రివీల్ చేస్తూ పోస్టర్ షేర్ చేశారు. అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ మీ ముందుకు రాబోతున్నారు అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రేమానురాగాలు పంచే అమ్మమ్మ సుశీలమ్మ పాత్రలో జయసుధ ప్రేక్షకుల మనసును హత్తుకోనున్నారని హామి ఇచ్చారు మేకర్స్.






