- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో "పెద్ది" పోస్టర్‌తో మహిళ హల్‌చల్
by velandi.Saikiran |
తిరుమలలో "పెద్ది" పోస్టర్‌తో మహిళ హల్‌చల్ చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో వివాదం తెరపైకి వచ్చింది. నడక మార్గంలో రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ పోస్టర్ తో ఓ మహిళ హల్ చల్ చేసింది. నిషేధం ఉన్నప్పటికీ సినిమా పోస్టర్ తో సదరు మహిళ పాదయాత్ర చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ, సినీ ప్రచారాలకు తిరుమల సన్నిధిలో అనుమతి లేదన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే దీనిపై టీటీడీ అధికారులు కూడా కఠినంగానే వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ తాజాగా నడక మార్గంలో సినిమా పోస్టర్ తో మహిళ రావడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ సంఘటనపై తిరుమల భక్తులతో పాటు వైసీపీ పార్టీ నేతలు కూడా ఫైర్ అవుతున్నారు. భద్రత విభాగం ఎందుకు ఈ విషయాన్ని గుర్తించలేకపోయిందని నిలదీస్తున్నారు. తిరుమల పవిత్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సంఘటనపై టీటీడీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Next Story






