- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేసవి సెలవుల ఎఫెక్ట్.. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్ధీ
తిరుమలలో భక్తుల రద్దీ అధికం. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం కోసం 15 గంటల సమయం పడుతోంది; నిన్న శ్రీవారిని 78,024 మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.3.85 కోట్లుగా నమోదైంది.

దిశ, వెబ్ డెస్క్: వేసవి సెలవుల కావడంతో కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. దీంతో తిరుమల క్షేత్రం మొత్తం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తుల సంఖ్య గంట గంటకు పెరగడంతో రద్దీ విపరీతంగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించడానికి సుమారు 15 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే నిన్న ఒక్కరోజే మొత్తం 78,024 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకోవడం లో భాగంగా 36,826 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ.3.85 కోట్ల ఆదాయం లభించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
- Tags
- Tirumala updates






