- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమలలో వేసవి రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
తిరుమలలో వేసవి సెలవుల సందడి! శ్రీవారి దర్శనం కోసం 12 గంటల నిరీక్షణ. నిన్న స్వామివారిని దర్శించుకున్న 79 వేల మందికి పైగా భక్తులు.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటకలోని స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించడంతో తిరుమల తిరుపతిలో రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవం అయిన ఆ వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలి వస్తుండటంతో తిరుమల కొండపై రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం సుమారు 12 గంటల సమయం పడుతోంది.
ఉచిత దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 30 కంపార్ట్‌మెంట్లలో భక్తులు నిండిపోయి వేచి ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఆదివారం ఒక్కరోజే స్వామివారిని 79,878 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 33,037 మంది మొక్కల మేరకు స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న ఒక్కరోజే తిరుమల హుండీకి రూ.3.94 కోట్ల ఆదాయం లభించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, అన్నప్రసాదం, మజ్జిగ పంపిణీని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.






