Weather Updates : వర్షాలకు టాటా.. నేటి నుంచి సూర్యుడు ఆన్ డ్యూటీ!

by Muthe.Rajitha |   (  Updated:2026-03-26 05:21:58  IST  )

తెలంగాణలో నేటి నుంచి వేడి మరింత పెరగనుంది. ముఖ్యంగా ఉత్తరం మరియు తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రంగా ఉండనుంది.

Weather Updates : వర్షాలకు టాటా.. నేటి నుంచి సూర్యుడు ఆన్ డ్యూటీ!
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో గత వారం, పది రోజులుగా అకస్మాత్తుగా పడిన అకాల వర్షాలు టాటా చెప్పేసాయి. నేటి నుంచి ఎండాకాలపు సూర్యుడు డ్యూటీ ఎక్కనున్నాడు. భగ్గున మండే ఎండతో ప్రజలు అల్లాడి పోనున్నట్టు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయి. ఆదిలాబాద్, కొమురం భీమ్ అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 39°C నుండి 41°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. గాలిలో తేమ తగ్గడంతో పొడి వాతావరణం కారణంగా వేడి గాలులు వీచే అవకాశం ఉంది.

అయినప్పటికీ ద్రోణి ప్రభావంతో వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నారాయణపేట, ఆదిలాబాద్, అసిఫాబాద్ జిల్లాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు 38°C నుండి 39°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉంది. అయితే నగరంలో సాయంత్రం వేళల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని, అయితే మిగిలిన సమయమంతా పొడి వాతావరణమే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు.

Next Story