Para Powerlifting at CWG: చరిత్ర సృష్టించిన Sudhir.. పారా పవర్‌ లిఫ్టింగ్‌లో తొలి పతకం

by Disha Web |
Sudhir wins Gold Medal in Mens Para Powerlifting at CWG 2022
X

దిశ, వెబ్‌డెస్క్ : Sudhir wins Gold Medal in Men's Para Powerlifting at CWG 2022| బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్‌ పతకాల వేట కొనసాగిస్తోంది. పారా పవర్‌ లిఫ్టింగ్‌ ఈవెంట్‌లో సుధీర్‌ భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్‌లో సుధీర్ స్వర్ణం గెలుచుకున్నాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ 2022 లో భారత్ ఆరో బంగారు పతకం కైవసం చేసుకుంది. ఇప్పటివరకు భారత్ ఆరు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఏడు కాంస్యాలతో మొత్తం 20 పతకాలు సాధించింది. ప్రస్తుతం పతకాల పట్టికలో ఏడవ ర్యాంకులో భారత్ కొనసాగుతోంది. 87 కేజీల సుధీర్ తన తొలి ప్రయత్నంలోనే 208 కేజీలు ఎత్తి 132 పాయింట్లకు పైగా సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. అయితే నైజీరియన్ లిఫ్టర్ నుంచి కఠిన సవాల్‌ను ఎదుర్కొన్నాడు. రెండో ప్రయత్నంలో 212 కిలోల బరువును ఎత్తి 134.5 పాయింట్లు సాధించి రికార్డు సృష్టించాడు.

ఇది కూడా చదవండి: పారా టేబుల్ టెన్నిస్‌లో ఫైనల్‌‌కు చేరిన Bhavina Patel


కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed