వాటర్ ట్యాంక్ ఎక్కిన బాలికను కాపాడిన సబ్ కలెక్టర్ కిరణ్మయి

by Muthe.Rajitha |

సూసైడ్ చేసుకుంటానని ఓ విద్యార్థి వాటర్ ట్యాంక్ ఎక్కగా.. సబ్ కలెక్టర్ కిరణ్మయి తన సమయస్ఫూర్తితో కాపాడారు.

వాటర్ ట్యాంక్ ఎక్కిన బాలికను కాపాడిన సబ్ కలెక్టర్ కిరణ్మయి
X

దిశ, వెబ్ డెస్క్ : కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఓ విద్యార్థిని మొండితనం వల్ల తొమ్మిదిన్నర గంటలపాటు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఫోన్‌ అతిగా వాడుతుండటంతో తల్లిదండ్రులు మందలించినందుకు మనస్తాపం చెందిన స్రవంతి అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని, మహ్మద్‌నగర్‌ మండలం బూర్గుల్‌ గ్రామంలోని సుమారు 60 అడుగుల ఎత్తైన నీటి ట్యాంకు ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగింది. ఉదయం 11 గంటల నుండి సర్పంచ్, పోలీసులు, తల్లిదండ్రులు ఎంతగా బతిమలాడినా, నచ్చజెప్పినా ఆమె వినకపోగా, దూకేస్తానంటూ భయాందోళనకు గురిచేసింది. విషయం తెలుసుకున్న బాన్సువాడ సబ్‌కలెక్టర్‌ కిరణ్మయి వెంటనే స్పందిించి రాత్రి 8 గంటల సమయంలో గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితిని గమనించిన ఆమె, సమయస్ఫూర్తితో తానే స్వయంగా ట్యాంకు ఎక్కుతూ, విద్యార్థినితో నిరంతరం మాట్లాడుతూ ఆమెను శాంతపరిచారు. చివరికి పైకి చేరుకుని, ఆమెకు భరోసా ఇచ్చి సురక్షితంగా కిందకు తీసుకువచ్చారు. సబ్‌కలెక్టర్ చూపిన సాహసం, చొరవతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story