Telangana : మద్యం సేవించి స్కూల్‌కు వెళ్లిన విద్యార్థులు

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-05 12:11:19  IST  )

కరీంనగర్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగుజూసింది.

Telangana : మద్యం సేవించి స్కూల్‌కు వెళ్లిన విద్యార్థులు
X

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్(Karimnagar) జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగుజూసింది. విద్యార్థులు మద్యం సేవించి(Students Drinking Alcohol) పాఠశాలకు వెళ్లారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి(Chigurumamidi) మండల కేంద్రంలోని పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థుల బ్యాగులు తనిఖీ చేయగా మద్యం సీసాలు బయటపడ్డాయి. పాఠశాల సమీపంలోని బెల్ట్ షాపు నుండి మద్యం కొన్నట్లు విద్యార్థులు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సదరు విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై తల్లిదండ్రులు కూడా ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. స్కూల్ సమీపంలో ఉన్న బెల్టు షాపులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. మద్యం దుకాణాలు సాయంత్రం 4 గంటల తర్వాతే తెరవాలని, రాత్రి 9 గంటలకే మూసివేయించాలని అధికారులను వేడుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story