- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్నేహితులకే పంగనామాలు.. ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.కోటిన్నర కొట్టేసిన ఘనుడు
తోటి విద్యార్థులను నమ్మించి ఓ బీటెక్ విద్యార్థి ఏకంగా రూ.1.50 కోట్లు వసూలు చేసి ముంచేసిన ఘటన గుంటూరులో కలకలం రేపింది.

దిశ, వెబ్ డెస్క్ : తోటి విద్యార్థులను నమ్మించి ఓ బీటెక్ విద్యార్థి ఏకంగా రూ.1.50 కోట్లు వసూలు చేసి ముంచేసిన ఘటన గుంటూరులో కలకలం రేపింది. కడపకు చెందిన విజయ్ నరసింహ అనే విద్యార్థి గుంటూరులోని ఓ ప్రవైట్ యూనివర్సిటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తాను ఒక స్టార్టప్ కంపెనీ నడుపుతున్నానని, అందులో ఇంటర్న్‌షిప్‌లతో పాటు ఉద్యోగాలు కూడా ఇప్పిస్తానని నమ్మబలికి తన తోటి విద్యార్థులనే టార్గెట్ చేశాడు. నమ్మకం కుదిరేలా మాట్లాడి ఒక్కో విద్యార్థి నుండి రూ.5 లక్షల నుండి రూ.20 లక్షల వరకు వసూలు చేశాడు. ఇలా కాలేజీకి చెందిన దాదాపు 40 మంది విద్యార్థుల నుండి దాదాపు రూ.కోటిన్నర డబ్బులు కాజేసినట్లు తెలుస్తోంది. డబ్బులు ఇచ్చి నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో బాధిత విద్యార్థులు తాము మోసపోయామని గ్రహించి, తల్లిదండ్రులతో కలిసి శనివారం మంగళగిరి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.






