- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్న రిపోర్టర్... బెస్ట్ న్యూస్ కవరేజ్ (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ బాలుడి...Student explaining problems like reporter in govt school of Jharkhand

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ బాలుడి రిపోర్టింగ్ చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అతడి కలను, వాస్తవ పరిస్థితిని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని, అక్కడ ఉన్న సమస్యలను చూసి ఆశ్చర్యపోతూ అతడిని అభినందిస్తున్నారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే... జార్ఖండ్ రాష్ట్రంలోని గొడ్డాలోని మహ్గమా బ్లాక్ లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో మౌళిక వసతులు కరువయ్యాయి. సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి ఉండడంతో విసుగు చెందిన ఓ బాలుడు రిపోర్టర్ అవతారమెత్తాడు. ఓ ప్లాస్టిక్ బాటిల్ ను కట్టెకు జత చేసి మైక్ మాదిరిగా మార్చాడు. అనంతరం ఆ స్కూల్లో ఉన్న సమస్యలను వివరిస్తూ వచ్చాడు. ఇదంతా కూడా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్ అవుతోంది. ఆ బాలుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పాఠశాలలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కారించాలంటూ నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఆ బాలుడిలో మంచి టాలెంట్ ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.






