- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవు
మంత్రి వివేక్ వెంకటస్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, టీఆర్ఎస్ పార్టీ పాలనలో నిజాం నిరంకుశ పాలన కొనసాగిందని పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు.

దిశ, చెన్నూర్ : మంత్రి వివేక్ వెంకటస్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, టీఆర్ఎస్ పార్టీ పాలనలో నిజాం నిరంకుశ పాలన కొనసాగిందని పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. మంగళవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. అధికారం కోల్పోయిన టీఆర్ఎస్ నాయకులు మతిస్థిమితం కోల్పోయి మంత్రిపై నిరాధార విమర్శలు చేస్తున్నారని, వారికి తగిన సమయంలో ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మాజీ జిల్లా ప్రజాపరిషత్ వైస్ చైర్మన్ మూలరాజిరెడ్డి అవినీతి, అక్రమాలు, ఇసుక దందాలకు పాల్పడుతున్న నేపథ్యంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆయనను పక్కన పెట్టారని తెలిపారు.
దానిని జీర్ణించుకోలేక మూలరాజిరెడ్డి కాంగ్రెస్ నాయకులను "బొంద పెడతాం" అని హెచ్చరించడం ఆయన రౌడీయిజానికి నిదర్శనమని విమర్శించారు. మూలరాజిరెడ్డి చరిత్ర ప్రజలందరికీ తెలుసునని, మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి మంత్రి వద్ద తన ఆధిపత్యం, రౌడీయిజం చెల్లకపోవడంతో టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం ప్రజలకు విదితమేనని పేర్కొన్నారు. మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు కారం మాత్రమే ఉన్న భోజనం పెడుతున్నారంటూ అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు. పాఠశాల సమయం ముగిసిన తర్వాత కొంతమంది విద్యార్థులతో తప్పుడు ఫొటోలు దిగించి, వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ మంత్రి పై విమర్శలు చేయడం దురుద్దేశపూరిత చర్య అని ఆరోపించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వాస్తవాలు తెలుసునని, టీఆర్ఎస్ నాయకులు ఎంత తప్పుడు ప్రచారం చేసినా మంత్రి వివేక్ వెంకటస్వామి నిజాయితీ, నిబద్ధత రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసునని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దింటి శ్రీనివాస్, సాధబోయిన కృష్ణ, పెండ్యాల సాగర్, కరుణ్ సాగర్, పాతర్ల నాగరాజు, రాజేష్, మహేష్, చిన్న వెంకటేష్, తనుగుల సతీష్, కరీం, సలీం తదితరులు పాల్గొన్నారు.






