- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు: ఏడీఏ
చింతకాని మండలంలోని విత్తన దుకాణాలను మధిర సహాయ వ్యవసాయ సంచాలకులు మరియు మండల ప్రత్యేక అధికారి అయిన వాణిశ్రీ సీడ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అయిన వైరా సర్కిల్ ఇన్‌స్పెక్టర్, చింతకాని ఎస్ఐ మరియు చింతకాని మండల వ్యవసాయ అధికారిని సోములపల్లి మానస తనిఖీలు నిర్వహించారు.

దిశ, చింతకాని: చింతకాని మండలంలోని విత్తన దుకాణాలను మధిర సహాయ వ్యవసాయ సంచాలకులు మరియు మండల ప్రత్యేక అధికారి అయిన వాణిశ్రీ సీడ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అయిన వైరా సర్కిల్ ఇన్‌స్పెక్టర్, చింతకాని ఎస్ఐ మరియు చింతకాని మండల వ్యవసాయ అధికారిని సోములపల్లి మానస తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం వానాకాలం సీజన్ సమీపిస్తున్న సందర్భంగా వచ్చినటువంటి విత్తనాలు వాటికి సంబంధించిన ఇన్వాయిస్, ప్రిన్సిపల్ సర్టిఫికెట్లు మరియు స్టాక్ రిజిస్టర్స్ తనిఖీ చేశారు.
విత్తనాలు అమ్మే డీలర్లు కచ్చితంగా ఇన్వాయిస్‌లు మరియు ప్రిన్సిపాల్ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలని మరియు స్టాక్ రిజిస్ట్రార్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. ఎవరైనా సరియైన డాక్యుమెంట్స్ లేకుండా విత్తనాలమ్మినట్లయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్టాక్ బోర్డ్ తప్పనిసరిగా తెలుగులోనే రాయాలని సూచించారు. HT(గడ్డి మందు తట్టుకునేది)కాటన్ నిషేధించబడినదని ఎవరైనా అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకవేళ గ్రామాల్లో రాత్రిపూట ఎవరైనా అమ్ముతున్నట్లు సమాచారం ఉన్నట్లయితే వెంటనే సంబంధిత వ్యవసాయ అధికారికి మరియు పోలీసు శాఖకు ఫిర్యాదు చేయాలని డీలర్లకు సూచించారు.






