- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు : తహసీల్దార్ లత
ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే ఎంతటి వారైనా వారి పై శాఖాపరమైన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ లత హెచ్చరించారు.

దిశ, నిజాంసాగర్ : ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే ఎంతటి వారైనా వారి పై శాఖాపరమైన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ లత హెచ్చరించారు. సోమవారం మహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 70/1లో ఉన్న 1.20 గుంటల ప్రభుత్వ భూమిలో రెవెన్యూ శాఖ అధికారులు హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ఈ భూమిని ఎవరైనా అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసు బోర్డులో పేర్కొన్నారు.
ఇటీవల ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేస్తున్నారని గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు పరిశీలించి, సదరు భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నట్లు తహసీల్దార్ లత తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ లత మాట్లాడుతూ ప్రభుత్వ భూములను పరిరక్షించడం రెవెన్యూ శాఖ బాధ్యత. ప్రభుత్వ భూముల్లో ఎలాంటి ఆక్రమణలను ఉపేక్షించేది లేదు. సంబంధిత వ్యక్తులకు ప్రభుత్వ భూమిలో వరి నాట్లు వేయవద్దని ముందస్తుగా సమాచారం ఇచ్చినప్పటికీ నిబంధనలను ఉల్లంఘించి వరి నాట్లు వేయడంతో భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశాం. హెచ్చరిక బోర్డును తొలగించినా, భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని అన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని, ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించిన సమాచారం ఉంటే ప్రజలు రెవెన్యూ అధికారులకు తెలియజేయాలని తహసీల్దార్ లత సూచించారు.






