- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Stress: స్ట్రెస్ హెల్త్‌కే కాదు.. అందాన్ని కూడా దెబ్బతీస్తుంది.. ఎలాగంటే..?
జీవన శైలిలో మార్పుల కారణంగా చాలా మంది ఒత్తిడికి గురవుతుంటారు.

దిశ, వెబ్‌డెస్క్: జీవన శైలిలో మార్పుల కారణంగా చాలా మంది ఒత్తిడికి గురవుతుంటారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనిషి సాగించే ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటాడు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి అన్ని విషయాల్లో వేగం పెంచాడు. వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తప్ప అన్నింటిలో దూసుకుపోతున్నారు. ఈ బిజీ బిజీ లైఫ్‌లో ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు. ఈ ఒత్తిడే మనిషిపాలిట శాపంగా మారుతోంది.
ఒత్తిడి అంటే క్లిష్ట పరిస్థితుల వల్ల కలిగే ఆందోళన లేదా మానసిక ఉద్రిక్తత. ఇది మన జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి మనల్ని ప్రేరేపించే సహజ ప్రతిస్పందన అని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఒత్తిడి లక్షణాలు చూసినట్లైతే.. కోపం, నిరాశ, అసహనం, అపనమ్మకం, శక్తి లేకపోవడం,తలనొప్పి, నిద్రపోవడంలో ఇబ్బంది, బరువులో మార్పులు, తలతిరగడం, వణుకు వంటివి ఒత్తిడి లక్షణాలని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఈ ఒత్తిడి కారణంగా అందంపై కూడా ప్రభావం చూపుతుందని తాజాగా నిపుణులు వెల్లడిస్తున్నారు. చాలా మంది నలుగురిలో అందంగా కనిపించాలని కోరుకుంటారు. ఇది మనిషిలోని సాధారణ ఆలోచన. కానీ పలు మార్లు పలు కారణాల వల్ల చర్మంపై దుమ్ము, ధూళి, యూవీ కిరణాలు వంటివి పడి.. మానసిక ఒత్తిడికి గువుతారంటూ నిపుణులు వెల్లడిస్తున్నారు.
స్ట్రెస్ కారణంగా ఫేస్ సహజ కాంతిని కోల్పోతుందని తాజాగా నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి ప్రభావం స్కిన్‌పై నేరుగా కనిపిస్తుంది. స్ట్రెస్ కారణంగా పెరిగిన కార్టిసోల్ హార్మోన్ స్కిన్ పై ఉన్న గ్రంథులు అధిక నూనెను రిలీజ్ చేసేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడితో ఫేస్ పై కాంతి కోల్పోవడమే కాకుండా ముఖంపై పింపుల్స్ వస్తాయి. స్కిన్ పొడిబారడం, దురద, దద్దుర్లు వంటి సమస్యలు తలెత్తుతాయి. కొల్లాజెన్ ఉత్పత్తి కూడా తగ్గి.. స్కిన్ పై ముందే వృద్ధాప్య లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.






