"సార్.. మటన్ ఉడకలేదు, కేసు పెట్టండి" : తాడిపత్రిలో వింత ఘటన

by Muthe.Rajitha |

తాను కొనుగోలు చేసిన మటన్ ఉడకలేదని ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ కి రావడంతో పోలీసులు కంగుతిన్నారు.

సార్.. మటన్ ఉడకలేదు, కేసు పెట్టండి : తాడిపత్రిలో వింత ఘటన
X

దిశ, వెబ్ డెస్క్ : అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఉగాది పండగ పూట మాంసం ఉడకలేదని ఏకంగా పోలీస్ స్టేషన్‌కు కుక్కర్‌తో సహా వెళ్లడంతో పోలీసులు అవాక్కయ్యారు. తాడిపత్రికి చెందిన సోడాల హాజీ.. ఉగాది పండగ రోజు స్థానిక మాంసాహార దుకాణంలో తీసుకున్న మటన్ 20 విజిల్స్ వచ్చినా ఉడకలేదని, కుక్కర్ తో సహా పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. పోలీసులు నేరస్థులను, దొంగలను చూసి ఉంటారు కానీ, ఇలా "కేసు పెట్టండి సార్.. నా మటన్ ఉడకలేదు" అంటూ కుక్కర్‌తో వచ్చిన బాధితుడిని చూసి ఒక్క క్షణం షాక్ అయ్యారు. అనంతరం అతనికి నచ్చజెప్పి పంపించి వేశారు గాని.. ఈ విషయం కాస్తా సోషల్ మీడియాకు చేరడంతో.. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

నెటిజన్స్ "శాంతి భద్రతల సమస్య కాదు.. ఇది వంటగది సమస్య!" అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే, "ఆ మటన్ ముక్క బహుశా జిమ్ కెళ్లి బాడీ బిల్డ్ చేసిందేమో, అందుకే ఉడకట్లేదు" అని మరికొందరు కామెంట్ చేసారు. 'తాడిపత్రి మటన్ కేసు' అంటూ మరికొందరు జోక్స్ పేలుస్తున్నారు.

Next Story