బార్‌లో పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్ : Double D బ్రెస్ట్‌లు ఉంటేనే అర్హులు

by Disha Web Desk |
బార్‌లో పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్ : Double D బ్రెస్ట్‌లు ఉంటేనే అర్హులు
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఏ సంస్థ అయినా జాబ్ ఆఫర్ చేస్తే తమ అవసరాలకు అనుగుణంగా అభ్యర్థి నుంచి తాము కోరుకుంటున్న ఎక్స్‌పీరియన్స్, యాటిట్యూడ్, లాంగ్వేజ్ స్కిల్స్ వివరాలను ప్రకటనలో పేర్కొంటారు. కానీ న్యూజిలాండ్‌ హోకిటికాలోని 'స్టంపర్స్ బార్ అండ్ కేఫ్' యాజమాన్యం మాత్రం విచిత్ర ఉద్యోగ ప్రకటనతో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. తమ బార్‌లో పనిచేయాలనుకునే వారి నుంచి మేనేజ్మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్న క్వాలిఫికేషన్స్ ఏంటో తెలిస్తే మీరు కూడా ముక్కున వేలేసుకుంటారు.

'పార్ట్ టైమ్ జాబ్ ఆశిస్తున్న సిబ్బంది తప్పనిసరిగా Double D బ్రెస్ట్‌లు(రొమ్ములు), చక్కటి చిరునవ్వు, గుడ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి. ఈ జాబ్‌కు పురుషులు కూడా అర్హులే' అని తెలిపే ప్రకటనను జాక్ కెవోర్కియన్ 'ఎవరికైనా హోకిటికాలో ఉద్యోగం కావాలా?' క్యాప్షన్‌తో తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేయగా.. కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ పోస్టుపై మండిపడుతున్న నెటిజన్లు.. ఇలాంటి ప్రకటనలు చట్టవిరుద్ధమని అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ప్రతిరోజు వేధింపులకు గురవుతారనేందుకు దీన్నొక స్పష్టమైన సూచనగా పేర్కొంటున్నారు.

Next Story

Most Viewed