- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరుసగా ఆరో రోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. బేర్ గుప్పిట్లో దలాల్ స్ట్రీట్
గత వారంలో వరుసగా ఐదు రోజులు నష్టాల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్లు ఈ సోమవారం అయిన కోలుకుంటాయని ఇన్వెష్టర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అంతర్జాతీయంగా నెలకొంటున్న పరిస్థితుల నేపథ్యంలో ఆరో రోజు కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: గత వారంలో వరుసగా ఐదు రోజులు నష్టాల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్లు (Stock markets) ఈ సోమవారం అయిన కోలుకుంటాయని ఇన్వెష్టర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అంతర్జాతీయంగా నెలకొంటున్న పరిస్థితుల నేపథ్యంలో ఆరో రోజు కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా పతనమయ్యాయి. సోమవారం ఉదయం నుండే నష్టాలతో ప్రారంభమైన సూచీలు, మిడ్-సెషన్ సమయానికి మరింత దిగజారాయి. సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్ల వరకు నష్టపోయి 82,800 స్థాయికి పడిపోగా, నిఫ్టీ 200 పాయింట్లు కోల్పోయి 25,500 దిగువకు చేరింది. బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. రిలయన్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ షేర్లు నష్టపోగా, టాటా స్టీల్, ఎన్‌టిపిసి వంటి కొన్ని షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. వరుసగా ఐదు, ఆరు సెషన్ల పాటు మార్కెట్లు పడిపోవడంతో మదుపరుల సంపద భారీగా ఆవిరైంది.
మార్కెట్ల పతనానికి ప్రధాన కారణం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలే మార్కెట్ల పతనానికి కారణం అని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై (భారత్ వంటివి) 500% వరకు టారిఫ్‌లు (సుంకాలు) విధిస్తామని ట్రంప్ హెచ్చరించడం, దీనిపై అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుండటం మదుపరులు ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి తోడు వెనిజూలా, ఇరాన్‌లలో నెలకొన్న యుద్ధ వాతావరణం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) వరుసగా నిధులను వెనక్కి తీసుకుంటుండటం మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. గ్లోబల్ మార్కెట్ల అనిశ్చితి కారణంగా రానున్న రోజుల్లో కూడా మార్కెట్లు అస్థిరంగానే ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.






