- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. రూపాయి విలువ మరింత పతనం!
అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, విదేశీ పెట్టుబడిదారుల విక్రయాల జోరుతో ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, విదేశీ పెట్టుబడిదారుల విక్రయాల జోరుతో ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock markets) నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 245 పాయింట్లు నష్టపోయి 83,382 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 42 పాయింట్ల స్వల్ప నష్టంతో 25,690 వద్ద ముగిసింది. ముఖ్యంగా ఐటీ, ఆటో రంగాల షేర్లలో భారీగా అమ్మకాల ఒత్తిడి కనిపించగా, టీసీఎస్, మారుతీ సుజుకీ వంటి దిగ్గజ సంస్థల షేర్లు 2 శాతం మేర క్షీణించాయి. అమెరికా విధిస్తున్న కొత్త టారిఫ్ హెచ్చరికలు, పెరుగుతున్న ముడిచమురు ధరలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
మరోవైపు, దేశీయ కరెన్సీ రూపాయి విలువ డాలర్‌తో పోల్చుకుంటే మరింత బలహీనపడి 90.29 వద్ద ఆల్-టైమ్ కనిష్ట స్థాయికి చేరువలో ముగిసింది. అయితే మార్కెట్ పతనంలోనూ మెటల్, పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగాలు మాత్రం రాణించాయి. వేదాంత షేరు సరికొత్త రికార్డు స్థాయిని తాకగా, సానుకూల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు 8 శాతానికి పైగా లాభపడ్డాయి. ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం ధరలు కూడా మార్కెట్ అనిశ్చితి వల్ల గరిష్ట స్థాయిలో కొనసాగుతున్నాయి.






