స్టాక్ మార్కెట్ అప్‌డేట్: నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ!

by Malleboina Mahesh |   (  Updated:2026-04-06 05:44:32  IST  )

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు! సెన్సెక్స్ 270 పాయింట్లు, నిఫ్టీ 93 పాయింట్లు పతనం. ముడి చమురు ధరల పెరుగుదల, యుద్ధ భయాలే ప్రధాన కారణం.

స్టాక్ మార్కెట్ అప్‌డేట్: నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ!
X

దిశ, వెబ్ డెస్క్: వారాంతపు సెలవుల తర్వాత నేడు ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు (Stock markets) భారీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో సూచీలు పతనమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్ సుమారు 27013 పాయింట్లు క్షీణించి 73,049.42 పాయింట్ల స్థాయికి పడిపోయింది. అలాగే ఎన్ఎస్‌ఈ నిఫ్టీ కూడా సుమారు 93 .60 పాయింట్లు నష్టపోయి 22,619.50 స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు (West Asia War), అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (Crude Oil) ధరలు బ్యారెల్‌కు 110 డాలర్లకు పైగా పెరగడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది.

మార్కెట్‌లో భయాందోళనలను సూచించే 'ఇండియా VIX' దాదాపు 2.7% పెరిగి 26.23 స్థాయికి చేరింది. ఇది మార్కెట్‌లో తీవ్రమైన ఒడుదొడుకులు ఉన్నాయని సూచిస్తుంది. తాజా పరిణామాలతో ముఖ్యంగా ఆయిల్ & గ్యాస్, హెల్త్‌కేర్, ఫార్మా రంగాలు నష్టాల్లో ఉండగా.. ఐటీ, మెటల్ రంగాలు స్వల్పంగా రాణిస్తున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FPIs) నిరంతరాయంగా తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం కూడా మార్కెట్ పతనానికి ఒక కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ట్రంప్ డెడ్‌లైన్ వేళ ముమ్మర చర్చలు.. 45 రోజుల సీజ్ ఫైర్ కుదిరేనా?

Oil Prices: ట్రంప్ ‘ఇరాన్’ హెచ్చరికల ఎఫెక్ట్.. భగ్గుమన్న చమురు ధరలు

Next Story