Oil Prices: ట్రంప్ ‘ఇరాన్’ హెచ్చరికల ఎఫెక్ట్.. భగ్గుమన్న చమురు ధరలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-06 05:42:45  IST  )

ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి, స్టాక్ మార్కెట్ ఫ్యూచర్స్ పతనమయ్యాయి.

Oil Prices: ట్రంప్ ‘ఇరాన్’ హెచ్చరికల ఎఫెక్ట్.. భగ్గుమన్న చమురు ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: హర్మూజ్ జలసంధిని వెంటనే తెరవాలంటూ అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆర్థిక మార్కెట్లు అతలాకుతలం అయ్యాయి. ఇరాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు దారితీయడమే కాకుండా, ఇన్వెస్టర్లలో ఆందోళనలో ఉన్నారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతుందనే భయంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (Crude Oil) ధరలు భారీగా పెరిగాయి. చమురు సరఫరాకు ఆటంకం కలుగుతుందనే అంచనాలతో ఆయిల్ ఫ్యూచర్స్ ఒక్కసారిగా పైకి దూసుకెళ్లాయి. బ్రెంట్ క్రూడ్‌ ధర 1.4 శాతం పెరిగి 110.60 డాలర్ల వద్దకు, అమెరికా క్రూడ్‌ ధర 1.8శాతం పెరిగి 113.60 డాలర్ల వద్దకు చేరుకుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల పెరుగుదలకు దారితీసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దూకుడుతో అమెరికా స్టాక్ మార్కెట్ ఫ్యూచర్స్ పతనమయ్యాయి. అనిశ్చితి నెలకొనడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. కేవలం అమెరికాలోనే కాకుండా ఆసియా, యూరప్ మార్కెట్లపై కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఐటీ, బ్యాంకింగ్ రంగాల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ట్రంప్ డెడ్‌లైన్ వేళ ముమ్మర చర్చలు.. 45 రోజుల సీజ్ ఫైర్ కుదిరేనా?

Next Story