భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. ఒక్కరోజే రూ.9 లక్షల కోట్ల సంపద ఆవిరి

by Kema Shiva Kumar |

భారత స్టాక్ మార్కెట్ నేడు భారీ నష్టాలను చవిచూసింది. అంతర్జాతీయ ప్రతికూల పవనాలు, ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడితో దేశీయ సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి.

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. ఒక్కరోజే రూ.9 లక్షల కోట్ల సంపద ఆవిరి
X

దిశ, వెబ్‌డెస్క్: భారత స్టాక్ మార్కెట్ నేడు భారీ నష్టాలను చవిచూసింది. అంతర్జాతీయ ప్రతికూల పవనాలు, ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడితో దేశీయ సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ (Sensex) ఏకంగా 1,065 పాయింట్లకు పైగా నష్టపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 82,180 పాయింట్ల వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ (Nifty) కూడా భారీగా నష్టపోయింది. నిఫ్టీ 360 పాయింట్లు కోల్పోయి, 25,232 పాయింట్ల వద్ద ముగిసింది. దీంతో ఒక్క రోజే ఇన్వెస్టర్ల రూ.9 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ప్రధానంగా హెవీవెయిట్ షేర్లలో అమ్మకాలు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలే ఈ భారీ పతనానికి కారణమని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దాదాపు అన్ని రంగాలు నేడు నష్టాల్లోనే ట్రేడ్ అవ్వడం గమనార్హం.

Next Story