- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనగామలో కలకలం.. 20 పేజీల సూసైడ్ నోట్ రాసి విశ్రాంత ఉపాధ్యాయుడి ఆత్మహత్య
జనగామ పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, జనగామ: జనగామ పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పూర్ణిమ కాలనీకి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు మల్లయ్య ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనకు ముందు ఆయన 20 పేజీల సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలో లభ్యమైన 20 పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని అందులో పేర్కొన్న అంశాలపై విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటి? సూసైడ్ నోట్‌లో ఎలాంటి వివరాలు ఉన్నాయి? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
Next Story






