ధోని పుట్టిన రోజు..త‌మిళ‌నాడు సీఎం పోస్ట్ వైర‌ల్

by velandi.Saikiran |

మహేంద్రసింగ్ ధోనికి పుట్టినరోజు శుభాకాంక్షలు సోషల్ మీడియా వేదికగా తెలిపారు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.

ధోని పుట్టిన రోజు..త‌మిళ‌నాడు సీఎం పోస్ట్ వైర‌ల్
X

దిశ‌, వెబ్ డెస్క్: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి తెలియని వారు ఉండరు. తన హయాంలో భారత జట్టుకు ఎన్నో ట్రోఫీలు అందించి... సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలోనే మిస్టర్ కూల్, సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ఎన్నో బిరుదులు కూడా అందుకున్నారు. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోని నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 45వ ఏట అడుగుపెడుతున్న ధోనికి, ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు వైరల్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ క్రికెటర్లు కూడా విషెస్ చెబుతున్నారు.

ఇలాంటి నేపథ్యంలోనే మహేంద్రసింగ్ ధోనికి పుట్టినరోజు శుభాకాంక్షలు సోషల్ మీడియా వేదికగా తెలిపారు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్. అవర్ కెప్టెన్ అని సంబోధిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ... భావి తరాలకు ఎంతో ఆదర్శం అన్నారు. అలాంటి మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడి ఎన్నో విజయాలు సాధించాడని గుర్తు చేశారు. ఆయన వల్ల చెన్నై జట్టుతో పాటు నగరానికి మంచి పేరు వచ్చిందని వెల్లడించారు. పుట్టి పెరిగింది జార్ఖండ్ అయినప్పటికీ... తమిళనాడుకు ఎన్నో సేవలు అందించాడని కొనియాడారు.

Next Story