- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాణ్యత ప్రమాణాలతో పనుల పురోగతిని పెంచాలి
మధిర మున్సిపాలిటీ మండల కేంద్రంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనుల పురోగతిని కనబరచాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర అన్నారు.

దిశ, మధిర : మధిర మున్సిపాలిటీ మండల కేంద్రంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనుల పురోగతిని కనబరచాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర అన్నారు. మంగళవారం మధిర పట్టణంలో కొనసాగుతున్న అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులు , రిటైనింగ్ వాల్, వైరా నది ఒడ్డున శ్రీ మృత్యుంజయ స్వామి ఆలయ సమీపంలో ఉన్న హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి పనులు, అండర్‌గ్రౌండ్ కేబుల్ పనులను ఖమ్మం జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర పరిశీలించారు. పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని, నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రజలు అధికారులకు విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో మధిర మున్సిపాలిటీ చైర్‌పర్సన్ సామినేని సుజాత, మున్సిపాలిటీ కమిషనర్ ఇజ్రాయిల్ బెనిటిక్ పాల్ మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తలుపుల వెంకటేశ్వర్లు మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పారుపల్లి విజయ్ కుమార్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రంగా శ్రీనివాసరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
దెందుకూరు పీఏసీఎస్‌లో కలెక్టర్ టీఎస్ దివాకర ఆకస్మిక తనిఖీ
ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో రైతులకు విత్తనాల సరఫరా ఎరువుల పంపిణీ చేయడంలో సహకార సంఘం అధికారులు పారదర్శకతను పాటించాలని, సహకార సంఘాల పనితీరును పర్యవేక్షించేందుకు ఖమ్మం జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర మంగళవారం మండల పరిధిలోని దెందుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయానికి చేరుకున్న కలెక్టర్, గోదాములలో నిల్వ ఉన్న ఎరువుల స్టాక్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఖరీఫ్ సాగుకు అత్యంత కీలకమైన సమయంలో రైతులకు ఎటువంటి విత్తనాలు ఎరువులు కొరత రాకూడదని ఆయన స్పష్టం చేశారు. యూరియా, ఇతర ఎరువుల లభ్యతపై అధికారులతో చర్చించిన ఆయన నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని, ఎరువులు, విత్తనాలు బ్లాక్ మార్కెటింగ్‌కు ఏమాత్రం తావులేకుండా ప్రభుత్వ నిర్ణీత ధరలకే విక్రయాలు జరగాలని ఆదేశించారు. తనిఖీల్లో భాగంగా కలెక్టర్ స్థానిక రైతులతో నేరుగా మాట్లాడారు వారికి అందుతున్న సేవలు, విత్తనాల పంపిణీలో నాణ్యత , ఎరువుల పంపిణీపై రైతుల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం "రైతులకు సకాలంలో నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందజేయడమే ముఖ్య లక్ష్యంగా సొసైటీ ద్వారా పంపిణీ చేసేందుకు విధివిధానాలు సిద్ధం చేశారన్నారు. ఆ దిశగా సహకార సంఘాల సిబ్బంది పనిచేయాలి. రైతులు కార్యాలయానికి వచ్చినప్పుడు వారిని ఆదరించి, సమస్యలను పరిష్కరించడంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి అని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మధిర తహాసిల్దార్ రాళ్ళ బండి రాంబాబు మధిర ఏడీఏ వాణిశ్రీ, ఏఓ కే.సాయి దీక్షిత్, పీఏసీఎస్ అధ్యక్షులు కోట వెంకట కృష్ణ, గ్రామ సర్పంచ్ పగిడిపల్లి శ్రీనివాసరావు, సొసైటీ సెక్రెటరీ నెలకుదుటి వెంకటేశ్వరరావు అయితం శ్రీనివాసరావు గ్రామ పెద్దలు సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






