40 శాతం తగ్గిన స్టార్టప్ కంపెనీల నిధుల సమీకరణ!

by Disha Web Desk 17 |
40 శాతం తగ్గిన స్టార్టప్ కంపెనీల నిధుల సమీకరణ!
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో భారతీయ స్టార్టప్‌లలో నిధులు 40 శాతం క్షీణించాయని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక వెల్లడించింది. సమీక్షించిన కాలంలో భౌగోళిక రాజకీయ అస్థిరత వల్ల స్టర్టప్ కంపెనీలు సుమారు రూ. 54 వేల కోట్ల నిధులను సాధించాయని నివేదిక ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. 2022, క్యూ2-స్టార్టప్ డీల్స్ ట్రాకర్ పేరుతో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం, సగటున రూ. 40 కోట్ల విలువ కలిగిన మొదటి దశ స్టార్టప్ ఒప్పందాలు 60 శాతానికి పరిమితమయ్యాయి. వరుసగా మూడు త్రైమాసికాల్లో రూ. 80 వేల కోట్ల కంటే ఎక్కువ నిధులను స్టార్టప్ కంపెనీలు సేకరించాయి.

ఈ క్రమంలోనే ప్రస్తుత ఏడాది రెండో త్రైమాసికంలో భారత స్టార్టప్ కంపెనీల నిధుల సమీకరణ 40 శాతం తగ్గింది. దీనికి ప్రపంచ మందగమనం, టెక్ కంపెనీల స్టాక్స్ విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ అస్థిరత వంటి అంశాల వల్లే నిధుల సమీకరణ క్షీణించిందని నివేదిక పేర్కొంది. సమీక్షించిన నెలలో అత్యధికంగా సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్(సాస్), ఫిన్‌టెక్ కంపెనీలు నిధుల వాటాను కలిగి ఉన్నాయి. వీటి వాటా రూ. 25 వేల కోట్ల కంటే ఎక్కువ నిధులను సేకరించాయి. స్టార్టప్ కంపెనీల్లు కొత్త ఒప్పందాల ద్వారా మెరుగైన నిధులు రాబట్టాయి. రానున్న త్రైమాసికాల్లో ఇదే ధోరణి ఉండవచ్చు. పెరిగిన డిజిటలైజేషన్, వెంచర్ కేపిటల్ పెట్టుబడులతో కార్యకలాపాలు పెరిగే అవకాశాలున్నాయని నివేదిక వివరించింది.


Next Story

Most Viewed