చిరంజీవిని ఆకాశానికెత్తేసిన సూర్య.. ఆయన లాంటి వ్యక్తి..

by Dishafeatures2 |
చిరంజీవిని ఆకాశానికెత్తేసిన సూర్య.. ఆయన లాంటి వ్యక్తి..
X

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవల 'జై భీమ్' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆయన.. ప్రస్తుతం 'ఈటీ'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ చిత్రం మార్చి 10న విడుదల కానుండగా తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో సూర్య పలు విషయాలపై మాట్లాడుతూ.. కంఫర్ట్ జోన్‏లో ఉండే వాళ్లు ఎప్పటికీ ఎదగలేరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఈ రోజు నేను చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ 'అగరం' ఫౌండేషన్ సంస్థను ప్రారంభించడానికి ఇన్‏స్పిరేషన్ ఇచ్చింది మాత్రం చిరంజీవిగారే. బ్లడ్ బ్యాంక్ స్థాపించి లక్షల మందిని ఆదుకుంటున్నారు. అందులో కొంతైనా చేయాలన్న ఉద్ధేశంతోనే 'అగరం' ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. మా సంస్థ నుంచి 5 వేల మంది పిల్లలకు కొత్త జీవితాలను ఇవ్వగలిగాం' అని వివరించారు.

Next Story