- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పబ్లిక్‌లో గొడవ పడ్డ స్టార్ కపూల్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ విశ్వ సుందరి ఐశ్వర్యారాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్‌ను ప్రేమించి 2007లో పెళ్లి కూడా చేసుకుంది. ఇక వీరికి ఆరాధ్య అనే పాప కూడా జన్మించింది. ఇదిలా ఉంటే, గత కొన్ని నెలలుగా ఐష్, అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నారనే పలు పుకార్లు నెట్టింట షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై వీరిద్దరూ స్పందించకపోవడంతో ఈ వార్తలకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో ఐష్ అభిషేక్‌కు సంబంధించిన పాత వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో మళ్లీ విడాకుల మ్యాటర్ ఊపందుకుంది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ప్రో కబడ్డీ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఐశ్వర్యరాయ్ తన కుటుంబంతో కలిసి ఆడియన్స్ గ్యాలరీలో కూర్చున్నారు. ఆమె వెంట ఆమె భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్య బచ్చన్, అలాగే నవ్య నవేలి నందా ఉన్నారు. ఆ సమయంలో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ మధ్య ఏదో గొడవ జరిగింది. ఇద్దరూ వాదించుకుంటూ కనిపించారు. విడాకుల వార్త వైరల్ కావడంతో.. ఈ వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే అభిషేక్ బచ్చన్‌తో వాదన తర్వాత ఐశ్వర్యరాయ్ సైలెంట్ అయ్యింది. తర్వాత నవ్య నవేలి నందా కూడా ఏదో చెప్పాలని ప్రయత్నించి సైలెంట్ అయిపోయింది. ఇంతటితో ఈ వీడియో పూర్తి అయిపోయింది. కాగా వారి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందనేది ఈ వీడియోలో స్పష్టంగా లేదు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
(video link credits to bollywood chronicle youtube channel)