16 సంవత్సరాల తర్వాత తెరపైకి స్టార్ కపుల్ కాంబో

by Dishanational2 |
16 సంవత్సరాల తర్వాత తెరపైకి స్టార్ కపుల్ కాంబో
X

దిశ, వెబ్‌డెస్క్ : సూర్యా, జ్యోతిక ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీల్ అండ్ రియల్ లైఫ్ కపుల్‌లో సూర్యా జ్యోతిక ఒకరు. ఇక వీరు స్కీన్‌పై జంటగా కనిపిస్తే చాలా ఫ్యాన్స్‌లో ఆనందం ఫీక్స్‌కు వెళ్తుంది. అయితే వీరు పెళ్లి చేసుకున్న తర్వాత జ్యోతిక ఎక్కువగా సినిమాలపై ఆసక్తి కనబరచలేదు. ఇక ఇప్పుడు రీ ఎంట్రీ తర్వాత తన వయసుకు తగిన పాత్రలను చేస్తూ అందరిని అలరిస్తోంది. అయితే ప్రస్తుతం సూర్యా చేయబోయే సినిమాలో జ్యోతిక కథానాయికిగా కనిపించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈటీ సినిమాతో థియేటర్లలోకి వచ్చిన సూర్య.. అదే జోరుతో వరసగా రెండు సినిమాలు చేయనున్నారు. అందులో ఒకటి వెట్రిమారన్‌తోను మరొకటి బాలతో చేస్తున్నారు. అయితే బాల దర్శకత్వంలో వచ్చే సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాలో హీరోయిన్లగా.. యంగ్ హీరోయిన్ కృతి శెట్టి, జ్యోతిక నటించనున్నట్లు టాక్. జ్యోతిక సూర్య కలిసి నటించి ఇప్పటికి 16 సంవత్సరాలు అవుతోంది. ఈ క్రమంలో వీరు జంటగా తెరపై కనిపించడానికి రెడీ అవడంతో ఫ్యాన్స్ ఆనందం మాటల్లో చెప్పలేనిది.

Next Story