నిలిచిపోయిన పూలే, అంబేద్కర్ భవన నిర్మాణం.. త్వరలో నిరసన దీక్షలు

by Jakkula.Mamatha |

హుజూరాబాద్ పట్టణంలో గత ఎనిమిదేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన మహాత్మా జ్యోతిరావు పూలే, బి.ఆర్. అంబేద్కర్ భవన నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు వేల్పుల ప్రభాకర్ తెలిపారు.

నిలిచిపోయిన పూలే, అంబేద్కర్ భవన నిర్మాణం.. త్వరలో నిరసన దీక్షలు
X

దిశ,​హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ పట్టణంలో గత ఎనిమిదేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన మహాత్మా జ్యోతిరావు పూలే, బి.ఆర్. అంబేద్కర్ భవన నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు వేల్పుల ప్రభాకర్ తెలిపారు. ఈ పోరాటంలో ప్రజాస్వామ్యవాదులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

​హామీలకే పరిమితమైన నిర్మాణం...

​ఈ సందర్భంగా వేల్పుల ప్రభాకర్ మీడియా తో మాట్లాడుతూ.. భవన నిర్మాణానికి సంబంధించిన నేపథ్యాన్ని వివరించారు.​ గత ప్రభుత్వ హయాంలో 2018లో అప్పటి మంత్రి ఈటల రాజేందర్ ఎస్సీ కార్పొరేషన్ నిధుల నుండి కోటి రూపాయలు మంజూరు చేసి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే కాంట్రాక్టర్ పిల్లర్లు లేపి పనులను మధ్యలోనే వదిలేశారు. ఆ తర్వాత అప్పటి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, మంత్రి హరీష్ రావుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినా ఎలాంటి పురోగతి లేకపోయింది.

​ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం...

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ప్రణవ్ బాబు చుట్టూ, ఇతర మంత్రుల చుట్టూ రెండున్నరేళ్లుగా తిరుగుతూ వినతిపత్రాలు ఇస్తున్నా ఫలితం లేకుండా పోయింది. మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించినప్పటికీ స్థానిక నాయకత్వం నుంచి సరైన స్పందన కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు."పాలకుల నిర్లక్ష్యం కారణంగానే భవన నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి పనులు ప్రారంభించే వరకు త్వరలో ప్రతిరోజూ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన దీక్షలు కొనసాగుతాయి." అని భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు వేల్పుల ప్రభాకర్ తెలిపారు. ​భవన నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమయ్యేంత వరకు కలిసికట్టుగా పోరాడతామని, ఈ దీక్షలకు బహుజన సమాజం, ప్రజా సంఘాలు పూర్తి మద్దతు ప్రకటించి కంకణబద్ధులై కలిసిరావాలని కమిటీ తరపున విజ్ఞప్తి చేశారు.

Next Story