- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిత్రపక్షాలతో స్టాలిన్ భేటీ
తమిళనాడులో రాజకీయ పరిణామాలు క్షణానికోసారి వేగంగా మారిపోతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడులో రాజకీయ పరిణామాలు క్షణానికోసారి వేగంగా మారిపోతున్నాయి. తాజాగా డీఎంకే చీఫ్ MK స్టాలిన్ తన మిత్ర పక్షాలతో సమావేశం అయ్యారు. వీసీకే, సీపీఐ, సీపీఎం రాష్ట్ర అధినేతలతో సమావేశం అయిన స్టాలిన్.. టీవీకేకు మద్దతుపై చర్చిస్తున్నట్టు సమాచారం. మెజారిటీ సీట్లు సాధించిన టీవీకేను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఆహ్వానించాలని డీఎంకే సహా, వీసీకే, వామపక్షాలు ఇప్పటికే డిమాండ్ చేసాయి. అయితే టీవీకేకు మద్దతు తెలిపే విషయం మీదనే ప్రస్తుత సమావేశం నడుస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కూటమిలోని కాంగ్రెస్ టీవీకేకు తన మద్దతును ప్రకటించగా.. మరిప్పుడు వీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కాసేపట్లో తెలియనుంది. ఇక 118 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని తమిళనాడు గవర్నర్ స్పష్టం చేయడంతో మరోసారి టీవీకే అధినేత విజయ్ కి చుక్కెదురైంది.






