- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డెడ్ హీట్ రేస్: ఒక్క ఓటు తేడాతో గెలిచి రికార్డులకెక్కిన శీనివాస సేతుపతి
తిరుపత్తూరులో ఒక్క ఓటుతో గెలిచి టీవీకే అభ్యర్థి శీనివాస సేతుపతి చరిత్ర సృష్టించారు. డీఎంకే అభ్యర్థిపై ఈ అరుదైన విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ (TVK party) భారీ విజయం సాధించడం మొదలు అనేక సంచలనాలు నెలకొన్నాయి. సీఎం స్టాలిన్ ఓడిపోగా.. దాదాపు 20 మంది మంత్రులు సైతం ఓటమిపాలయ్యారు. అలాగే ఎంతో మంది మొదటి సారి ఎమ్మెల్యేలుగా భారీ మెజార్టీతో గెలిచారు. అలాగే స్టార్ పొలిటీషన్స్ కూడా ఈ ఎన్నికల్లో ఓటమిపాలు అయ్యారు. కానీ తిరుపత్తూరు నియోజకవర్గం సరికొత్త చరిత్రకు వేదికైంది. ఈ స్థానంలో TVK అభ్యర్థి శీనివాస సేతుపతి (Srinivasa Sethupathi), డీఎంకే అభ్యర్థిపై కేవలం 'ఒక్క ఓటు' మెజారిటీతో విజయం సాధించి రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేశారు. హోరాహోరీగా సాగిన కౌంటింగ్‌లో చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగగా, అంతిమంగా ఒక్క ఓటుతోనే గెలుపు లభించడం విశేషం.
దీంతో రాజకీయ చరిత్రలో అతి తక్కువ మెజారిటీతో గెలుపొందిన అభ్యర్థుల జాబితాలో శీనివాస సేతుపతి పేరు ఇప్పుడు శాశ్వతంగా నిలిచిపోనుంది. ఒక్క ఓటు విలువ ఏమిటో ఈ ఫలితం మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. భారత ఎన్నికల చరిత్రలో ఇలాంటి అరుదైన విజయాలు గతంలోనూ నమోదయ్యాయి. 2004 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సంతెమరహళ్లి నియోజకవర్గం నుండి ఆర్. ధ్రువనారాయణ కేవలం ఒక్క ఓటుతో గెలిచి రికార్డు సృష్టించారు. అలాగే 2008 రాజస్థాన్ ఎన్నికల్లో సీపీ జోషి కూడా ఒక్క ఓటు తేడాతోనే ఓటమి పాలయ్యారు. తాజాగా తిరుపత్తూరులో శీనివాస సేతుపతి సాధించిన ఈ విజయం, ప్రతి ఒక్క ఓటు ప్రజాస్వామ్యంలో ఎంత కీలకమో నిరూపిస్తూ చరిత్ర పుటల్లోకెక్కింది.






