జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో శ్రీ చైతన్య ప్రభంజనం

by Muthe.Rajitha |

నేడు విడుదలైన జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో శ్రీ చైతన్య మరోసారి అగ్రస్థానం కైవసం చేసుకుంది.

జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో శ్రీ చైతన్య ప్రభంజనం
X

దిశ, తెలంగాణ బ్యూరో: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసిన జేఈఈ మెయిన్ 2026 సెషన్1 ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యాసంస్థలు సరికొత్త చరిత్ర సృష్టించాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ఏడాది ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు మునుపెన్నడూ లేని విధంగా అద్భుత విజయాలను నమోదు చేశారు. శ్రీ చైతన్య విద్యార్థి పసల మోహిత్ జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. 300 మార్కులకు గాను 300 మార్కులతో పర్ఫెక్ట్ స్కోర్ సాధించి, 100 పర్సెంటైల్ తో దేశంలోనే అగ్రగామిగా నిలిచాడు. మోహిత్‌తో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు 290, 285, 280 వంటి అత్యధిక మార్కులు సాధించి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. సబ్జెక్టుల వారీగా కూడా విద్యార్థులు అత్యుత్తమ పర్సెంటైల్స్ సాధించడం విశేషం.ఈ విజయంపై శ్రీ చైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

"వరుసగా నాలుగేళ్లుగా జేఈఈ మెయిన్‌లో 300కు 300 మార్కులతో మా విద్యార్థులు సంచలనం సృష్టిస్తున్నారు. విద్యార్థుల కఠోర శ్రమ, మా సాటిలేని అకడమిక్ ప్రోగ్రామ్స్, పక్కాగా రూపొందించిన షెడ్యూల్స్, ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఈ విజయానికి పునాదులు. ఆధునిక టెక్నాలజీని, మారుతున్న జనరేషన్‌ను దృష్టిలో ఉంచుకుని శిక్షణలో మేము తెచ్చిన విప్లవాత్మక మార్పులకు ఈ ఫలితాలే సాక్ష్యం" అని ఆమె పేర్కొన్నారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల ‘ఇన్ఫినిటీ లెర్న్’ ) ఆన్‌లైన్ యాప్, అలాగే దేశంలోని అత్యుత్తమ అధ్యాపక బృందం అందించిన మార్గనిర్దేశం విద్యార్థులను విజేతలుగా నిలబెట్టాయని సుష్మ తెలిపారు. ఈ అద్భుతమైన ఘనత సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, అధ్యాపక బృందాన్ని యాజమాన్యం అభినందించింది.

Next Story