- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉప్పల్‌లో మళ్లీ ఆ 'విధ్వంసం' రిపీట్ అవుతుందా.. నేటి మ్యాచ్ పిచ్ రిపోర్ట్ ఇదే..?
ఉప్పల్‌లో నేడు ఎస్‌ఆర్‌హెచ్ vs ఎల్‌ఎస్‌జీ! గతంలో 9 ఓవర్లలోనే 160+ లక్ష్యాన్ని ఊదేసిన సన్‌రైజర్స్.. మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా నేడు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం (ఉప్పల్) భారీ పోరుకు సిద్ధమైంది. సొంత గడ్డపై ఈ సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఆడుతున్న మొదటి మ్యాచ్ కావడంతో నేటి మ్యాచ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో భాగంగా మధ్యాహ్నం 3.30 గంటలకు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తో సన్ రైజర్స్ జట్టు తలపడనుంది. గతంలో లక్నోపై సన్‌రైజర్స్ సృష్టించిన ఆల్-టైమ్ రికార్డ్ విధ్వంసం నేపథ్యంలో, నేటి మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆ 'నమ్మశక్యం కాని' రికార్డు గుర్తుందా?
గత సీజన్‌లో ఇదే ఉప్పల్ వేదికగా లక్నోపై సన్‌రైజర్స్ సృష్టించిన అద్భుతం ఐపీఎల్ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయింది. లక్నో నిర్దేశించిన 160 పరుగుల పైచిలుకు లక్ష్యాన్ని, సన్‌రైజర్స్ ఓపెనర్లు కేవలం 9.4 ఓవర్లలోనే ఛేదించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఆ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ జరిపిన మెరుపు దాడిని తలచుకుంటేనే లక్నో బౌలర్లకు ఇప్పటికీ వణుకు పుడుతుందనడంలో సందేహం లేదు. నేడు కూడా అదే తరహా విధ్వంసం కోసం ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు.
పిచ్ రిపోర్ట్: బ్యాటర్లకు స్వర్గధామం!
ఉప్పల్ పిచ్ ఈసారి కూడా 'ఫ్లాట్'గా ఉండే అవకాశం ఉంది. అంటే బంతి బ్యాట్‌పైకి చాలా వేగంగా వస్తుంది, దీనివల్ల భారీ సిక్సర్లు కొట్టడం సులభం అవుతుంది. ఇక్కడి ఔట్‌ఫీల్డ్ చాలా వేగంగా ఉంటుంది. చిన్న బౌండరీల వల్ల పరుగుల వర్షం కురిసే అవకాశం పుష్కలంగా ఉంది. మ్యాచ్ ఆరంభంలో కొత్త బంతితో ఫాస్ట్ బౌలర్లకు కొద్దిగా స్వింగ్ లభించినా, ఆ తర్వాత బ్యాటర్లదే ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉన్నట్లు పిచ్ రిపోట్లను అంచనా వేస్తున్నారు. ఈ మ్యాచులో టాస్ గెలిచిన జట్టు నిస్సందేహంగా బ్యాటింగ్ ఎంచుకుని, 220-230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఫిక్స్ చేయాలని చూస్తుంది. ఇదిలా ఉంటే సొంత ప్రేక్షకుల మధ్య సన్‌రైజర్స్ మళ్లీ ఆ పాత రికార్డును గుర్తు చేస్తూ లక్నోను చిత్తు చేస్తుందా? లేక లక్నో ప్రతీకారం తీర్చుకుంటుందా? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్: ఇషాన్ కిషన్ (c &wk), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, డేవిడ్ పేన్, ఈషాన్ మలింగ (ప్రభావ ఆటగాడు)
లక్నో సూపర్ జెయింట్స్ : రిషబ్ పంత్ (c & wk), ఐడెన్ మార్క్‌రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, షాబాజ్ అహ్మద్, మహ్మద్ షమీ, అన్రిచ్ నార్జే, మొహ్సిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ (ఇంప్యాక్ట్ ప్లేయర్)






