Sreeleela: దాని తర్వాత ఇలా ఉన్నానంటూ ఫొటోలు షేర్ చేసిన కుర్ర హీరోయిన్ (పోస్ట్)

by Kodari Anjali |   (  Updated:2025-02-10 03:47:01  IST  )

టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela I) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Sreeleela: దాని తర్వాత ఇలా ఉన్నానంటూ ఫొటోలు షేర్ చేసిన కుర్ర హీరోయిన్ (పోస్ట్)
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela I) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ఏ ముహూర్తాన తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిందో తెలియదు కానీ వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది. ఏకంగా సీనియర్ హీరోల సరసన చాన్సులు కొట్టేసి.. అతితక్కువ సమయంలోనే ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది.

ఏకంగా బాలకృష్ణ(Balakrishna), మాస్ మహారాజా రవితేజ(Mas Maharaja Ravi Teja), వంటి అగ్ర హీరోల సరసన నటించింది. టాలీవుడ్ సీనియర్ ప్రముఖ నటీమణులకే గట్టి పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon star Allu Arjun)కథానాయకుడి.. సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన వరల్డ్ బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప -2 (Pushpa)లో ఐటెమ్ సాంగ్ కు గ్లామర్ స్టెప్పులేసి.. కుర్రాళ్లకు చెమటలు పట్టించింది.

పెళ్లి సందడి (Peḷli sandaḍi) సినిమాతో ఈ కుర్రది తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇంత చిన్న వయస్సులోనే గొప్ప గుర్తింపు దక్కించుకోవడం నిజంగా శ్రీలలోని స్పెషల్ టాలెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ హీరోయిన్ పెళ్లి సందడి సినిమా తర్వాత ధమకా, భగవంత్ కేసరి(Bhagwant Kesari), ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం వంటి చిత్రాల్లో నటించి తెలుగు నెటిజ్లను కట్టిపడేసిందనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం శ్రీలీల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అయిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే..

శ్రీలీల తరచూ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటుందన్న విషయం తెలిసిందే. ఏదో ఒక పోస్ట్ పెడుతూ.. ఫ్యాన్స్‌ను అలరిస్తుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ.. తాజాగా గ్రీన్ కలర్ టీషర్ట్ ధరించి.. ఫొటోలు పంచుకుంది. అంతేకాకుండా ఈ ఫొటోలకు ‘నిద్రాణస్థితి తర్వాత ’ అని ఓ క్యాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story