నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-18 15:55:52  IST  )

నమ్మదగిన సమాచారంపై పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు నూతనకల్ మండల పరిధిలోని పెదనేమిల క్రాస్ రోడ్డులో వాహనాల తనిఖీ నిర్వహించారు.

నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్
X

దిశ, నూతనకల్: నమ్మదగిన సమాచారంపై పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు నూతనకల్ మండల పరిధిలోని పెదనేమిల క్రాస్ రోడ్డులో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో టీఎస్ 26 5651 నెంబర్ గల మోటార్ సైకిల్ పై అనుమానాస్పదంగా వస్తున్న వ్యక్తిని తనిఖీ చేయగా అతని వద్ద అరుణోదయ లేబుల్ కలిగిన 65 నకిలీ విత్తనాల ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై నాగరాజు తెలిపారు. అతనిని విచారించగా మహబూబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపూడి గ్రామానికి చెందిన ఏక స్వామిగా గుర్తించి కేసు నమోదు చేశామని, అతనితోపాటు నందిగామకు చెందిన మరో వ్యక్తి రాంబాబు, మరో కొంతమందిని విచారించి కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వ్యవసాయ అధికారులు ఉన్నారు.

Next Story