- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్ల సీజ్
ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న రెండు భారీ టిప్పర్లను గోపాల్‌పేట పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు.

దిశ,గోపాల్‌పేట: మండల పరిధిలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న రెండు భారీ టిప్పర్లను గోపాల్‌పేట పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎదుట్ల గ్రామం నుండి గోపాల్‌పేట వైపునకు అక్రమంగా మట్టి రవాణా జరుగుతోందనే నమ్మదగిన సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. నిన్న రాత్రి సుమారు 7గంటల సమయంలో గోపాల్‌పేట పోలీస్ సిబ్బంది తనిఖీలు చేపట్టగా,ఎదుట్ల నుండి మట్టి లోడ్‌తో వస్తున్న రెండు భరత్ బెంజ్ టిప్పర్లను (వాహనం నంబర్లు: TS 06 UD 7760 మరియు TS 07 WJ 1822 అడ్డుకున్నారు. ఈ అక్రమ మట్టి రవాణాకు పాల్పడుతున్న నిందితుడు ఎర్రగట్టు తండాకు చెందిన మల్లేష్‌గా పోలీసులు గుర్తించారు.మట్టి తవ్వకాలకు మరియు రవాణాకు సంబంధించిన ఎలాంటి బిల్లులు,మైనింగ్ శాఖ అనుమతి పత్రాలు చూపకపోవడంతో ఆ రెండు టిప్పర్లను వెంటనే స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ప్రభుత్వ ముందస్తు అనుమతులు లేకుండా సహజ వనరులను అక్రమంగా తరలిస్తే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు తదుపరి చర్యల నిమిత్తం గురువారం మైనింగ్ అధికారులకు నివేదించినట్లు గోపాల్‌పేట పోలీసులు తెలిపారు.
- Tags
- Two tippers
- soil






