విధులకు వచ్చి కుప్పకూలిన ఎస్‌పీఓ.. చికిత్స పొందుతూ మృతి

by Jakkula.Mamatha |

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌పీఓ కానిస్టేబుల్ నాగార్జున రెడ్డి(60) గుండెపోటుతో మృతి చెందారు.

విధులకు వచ్చి కుప్పకూలిన ఎస్‌పీఓ.. చికిత్స పొందుతూ మృతి
X

దిశ, మల్కాజ్గిరి: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌పీఓ కానిస్టేబుల్ నాగార్జున రెడ్డి(60) గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని చిక్కడపల్లి సీఐ మధుబాబు తెలిపారు. మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన నాగార్జున రెడ్డి ప్రతి రోజులాగే విధులకు హాజరయ్యేందుకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో సహచర పోలీసులు వెంటనే ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. నాగార్జున రెడ్డి భారత సైన్యంలో సేవలందించి పదవీ విరమణ అనంతరం ఎస్‌పీఓగా పోలీసు శాఖలో చేరారు. దోమలగూడ, చిక్కడపల్లి తదితర పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, సహచర పోలీసు సిబ్బంది తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Next Story