రావాలాకోట్‌లో దారుణం: పోలీసుల కాల్పుల్లో 14 మంది యువకులు మృతి

by Malleboina Mahesh |

పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoJK)లోని రావాలాకోట్‌లో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

రావాలాకోట్‌లో దారుణం: పోలీసుల కాల్పుల్లో 14 మంది యువకులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoJK)లోని రావాలాకోట్‌లో సోమవారం రాత్రి తర్వాత చోటుచేసుకున్న ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిరసన తెలుపుతున్న యువతపై పాకిస్థాన్ పోలీసులు, భద్రతా బలగాలు జరిపిన అంధాధున్ కాల్పుల్లో దాదాపు 14 మంది యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు, స్థానిక నాయకులు తెలిపారు. నిర్దాక్షిణ్యంగా జరిగిన ఈ కాల్పుల ఘటనతో ప్రాంతంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) కోర్ మెంబర్ ఇంతియాజ్ అస్లాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ బలగాలు అమాయక యువతపై కాల్పులు జరిపి పొట్టనబెట్టుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉన్న కశ్మీరీలందరూ వెంటనే స్పందించి పాకిస్థాన్ ఎంబసీలు, ఐక్యరాజ్యసమితి (UN), అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థల కార్యాలయాల ఎదుట భారీ ఎత్తున నిరసనలు తెలుపాలని, పాక్ బలగాల అరాచకాలను ప్రపంచానికి చాటి చెప్పాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

Next Story