- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అరెస్ట్ చేసిన విద్యార్థులను వెంటనే విడిచిపెట్టండి: సుప్రీంకోర్టు
నీట్ నిరసనల్లో అరెస్టయిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా పరీక్షల లీకేజీలు, అక్రమాలకు నిరసనగా జూలై 20 నుంచి విద్యార్థులు చేపట్టిన ఆందోళనల్లో అరెస్ట్ అయిన విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుని కేంద్రం ఆయా రాష్ట్రాలు వారిని వెంటనే విడుదల చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నేర చరిత్ర లేని, నిరసనల్లో పాల్గొని అరెస్ట్ లేదా నిర్బంధంలో ఉన్న విద్యార్థులందరినీ వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. నేర చరిత్ర లేని విద్యార్థులపై ఎలాంటి బలవంతపు లేదా కఠిన చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది.
రాష్ట్రాలకు నోటీసులు:
సీజేపీ చేపట్టిన ఆందోళనల్లో చెలరేగిన హింస, పోలీసుల దౌర్జన్యాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలపై పారదర్శకంగా, నిష్పాక్షికంగా విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన 'ప్రత్యేక విచారణ బృందం' (SIT) ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఈ వ్యవహారంపై స్పందించాలని కేంద్రంతో పాటు ఢిల్లీ ప్రభుత్వం, తెలంగాణ సహా అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లపై మంగళవారం సమగ్ర విచారణ చేపట్టింది.






