జగిత్యాలలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

by Jakkula.Mamatha |

జగిత్యాల పట్టణంలోని పికప్ పాయింట్ ముందు ఆర్టీసీ బస్సు, ప్రైవేట్‌ పాఠశాల బస్సు ఢీకొన్నాయి.

జగిత్యాలలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
X

దిశ జగిత్యాల, టౌన్: జగిత్యాల పట్టణంలోని పికప్ పాయింట్ ముందు ఆర్టీసీ బస్సు, ప్రైవేట్‌ పాఠశాల బస్సు ఢీకొన్నాయి. జగిత్యాల యావర్ రోడ్డు క్రాస్ చేస్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటన సమయంలో స్కూల్ బస్సులో 20 మంది విద్యార్థులు ఉండగా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పెను ప్రమాదం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాల బస్సు డ్రైవర్‌ రోడ్డు క్రాస్‌ చేసే సమయంలో ఆర్టీసీ బస్సు జగిత్యాల పాత బస్టాండ్‌ నుంచి కొత్త బస్టాండ్‌ వెళుతున్న సమయంలో పాఠశాల బస్సును ఢీకొట్టింది. ఇందుకు సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. ప్రమాద సమయంలో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. హుటాహుటిన విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి వారిని ఇంటికి తీసుకెళ్లారు. ఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్‌ పోలీసులు, ట్రాఫిక్ ను క్లియర్ చేసి ప్రమాద వివరాలు సేకరించారు

Next Story