ఆపరేషన్ తర్వాత హీరో రామ్ చరణ్ హెల్త్ బులిటెన్ విడుదల

by Malleboina Mahesh |

కోయంబత్తూర్ గంగా ఆస్పత్రిలో సోమవారం శస్త్రచికిత్స అనంతరం హీరో రామ్ చరణ్ హెల్ బులిటెన్ ను డాక్టర్లు విడుదల చేశారు.

ఆపరేషన్ తర్వాత హీరో రామ్ చరణ్ హెల్త్ బులిటెన్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) కుడిచేతి మణికట్టు తీవ్ర గాయానికి (TFCC ) తమిళనాడులోని కోయంబత్తూరు గంగా ఆసుపత్రిలో సోమవారం శస్త్రచికిత్స చేశారు. కాగా ఈ సర్జరీ అనంతరం ఆయన ఆరోగ్యం చాలా బాగుందని, ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు హెల్త్ బులిటెన్ (Health Bulletin) విడుదల చేశారు. చరణ్ మరో రోజు ఆసుపత్రిలోనే వైద్యుల సంరక్షణలో ఉండనున్నాడని, గురువారం ఉదయం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

ఈ సంక్లిష్టమైన శస్త్రచికిత్సను గంగా ఆసుపత్రి ఆర్థోపెడిక్ సర్జరీ (Orthopedic Surgery) హెడ్ డాక్టర్ రాజ్ శేఖరన్, ప్లాస్టిక్ సర్జరీ విభాగం హెడ్ డాక్టర్ రాజా సబాపతి, డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్‌లతో కూడిన నిపుణుల బృందం విజయవంతంగా నిర్వహించింది. చికిత్స అనంతరం రామ్ చరణ్ సదరు సర్జన్ల బృందంతో కలిసి దిగిన చిత్రం కూడా ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.

Next Story