జిల్లేల్లకు చేరుకున్న కవిత.. అంబేద్కర్‌ విగ్రహానికి ఘన నివాళి!

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-28 08:02:16  IST  )

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తంగళ్ళపల్లి మండలం జిల్లెల్లకు చేరుకున్నారు.

జిల్లేల్లకు చేరుకున్న కవిత.. అంబేద్కర్‌ విగ్రహానికి ఘన నివాళి!
X

దిశ,తంగళ్ళపల్లి:తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తంగళ్ళపల్లి మండలం జిల్లెల్లకు చేరుకున్నారు. మంగళవారం మండలంలోని నేరెళ్ల బాధితులను కలిసేందుకు వస్తున్న సందర్భంగా మొదటగా జిల్లెల్ల గ్రామం వద్ద కవితకు టీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం టీఆర్ఎస్ చీఫ్ కవిత గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నేరెళ్లకు కవిత రాక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. నేరెళ్ల బాధితులను పరామర్శించిన అనంతరం కవిత మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.

Next Story