ప్రధాని మోడీ అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశం

by Malleboina Mahesh |

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఎన్డీఏ (NDA) పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగింది.

ప్రధాని మోడీ అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశం (NDA parliamentary meeting) జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అధ్యక్షతన పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగిన ఈ సమావేశానికి ఎన్డీయేలోని అన్ని పార్టీల ఎంపీలతో పాటు టీఎంసీ రెబల్ ఎంపీలు (TMC rebel MPs) 20 మంది కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉంటే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఎన్డీఏ కూటమి సభ్యులు సమావేశం అవ్వడం ఇది రెండోసారి. గత మంగళవారం 'మంగళ్ మిలాన్' పేరుతో తొలిసారిగా సమావేశమైన నాయకులు, ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టేందుకు, సభలో అనుసరించాల్సిన విధానాలపై చర్చించిన విషయం తెలిసిందే.

ఈ సమావేశంలో ప్రధానంగా ఇటీవల దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, యువత చేపడుతున్న ఆందోళనలు, ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలపై విస్తృతంగా చర్చించారు. దీంతో పాటు పార్లమెంట్‌లో బిల్లుల ఆమోదం, సభ సాఫీగా సాగేందుకు అధికార కూటమి ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధాని మోడీ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. అలాగే యాంటీ పేపర్ లీక్ బిల్లుపై సభలో చర్చ జరగనున్న క్రమంలో ఎన్డీయే పక్ష నేతలు సమావేశం కావడం తీవ్ర ప్రాముఖ్యతను సంతరించుకుంది. కాగా ఈ భేటీకి కేంద్ర మంత్రులు, బీజేపీ సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పార్లమెంట్ సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

Next Story