- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యశ్ నటనపై ప్రశంసలు కురిపించిన రణబీర్ కపూర్..
సినిమా చివర్లోనే రాముడు-రావణాసురుల కలయిక ఉంటుంది. మధ్యలో ఒక చిన్న సన్నివేశం ఉండవచ్చు. అయితే ఆ భారీ ఘట్టాలను మేమింకా షూట్ చేయలేదు.

దిశ, సినిమా: నితీశ్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ ‘రామాయణ’ ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, కైకేయిగా లారా దత్తా, లక్ష్మణుడిగా రవి దూబే, భరతుడిగా ఆదినాథ్ కొఠారే, దశరథుడిగా అరుణ్ గోవిల్ నటిస్తున్నారు. రణబీర్-సాయిపల్లవిల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా కావడం విశేషం. తాజాగా, అంతర్జాతీయ వేదికపై భారతీయ పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’ సందడి ఘనంగా మొదలైంది. అమెరికాలోని ప్రతిష్టాత్మక శాన్ డియాగో కామిక్-కాన్ వేడుకల్లో ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలక విశేషాలను చిత్ర బృందం ప్రపంచవ్యాప్త అభిమానులతో పంచుకుంది. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో దర్శకుడు నితీష్ తివారీతో పాటు, సినిమాలో రాముడి పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, రావణాసురుడిగా నటిస్తున్న కన్నడ రాకింగ్ స్టార్ యశ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ.. రాముడిగా తను, రావణాసురుడిగా యశ్ కనిపించే కీలకమైన సన్నివేశాలు ఇంకా చిత్రీకరించాల్సి ఉందని వెల్లడించారు. "సినిమా చివర్లోనే రాముడు-రావణాసురుల కలయిక ఉంటుంది. మధ్యలో ఒక చిన్న సన్నివేశం ఉండవచ్చు. అయితే ఆ భారీ ఘట్టాలను మేమింకా షూట్ చేయలేదు. యశ్ నటనా శైలి, ఆయన స్టార్‌డమ్ ఈ రావణాసురుడి పాత్రకు అత్యంత అవసరం. సాంప్రదాయక శైలికి భిన్నంగా తనదైన స్వాగ్, విభిన్నమైన నటనతో రావణాసురుడి పాత్రకు యశ్ ప్రాణం పోశారు" అని రణ్‌బీర్ ప్రశంసల వర్షం కురిపించారు. నమిత్ మల్హోత్రా నిర్మాణంలో.. రెండు భాగాలుగా రాబోతుంది. మొదటి భాగం ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల కానుండగా, రాముడు-రావణాసురుల మధ్య జరిగే ప్రధాన యుద్ధ ఘట్టాలతో కూడిన రెండవ భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. రణ్‌బీర్ వ్యాఖ్యలతో ఈ పౌరాణిక దృశ్యకావ్యంపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.






