16 మంది మావోయిస్టుల లొంగుబాటు

by Malleboina Mahesh |   (  Updated:2026-07-28 07:12:45  IST  )

ఝార్ఖండ్ రాజధాని రాంచీలో 16 మంది మావోయిస్టులు హింసామార్గాన్ని వీడి, పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.

16 మంది మావోయిస్టుల లొంగుబాటు
X

దిశ, వెబ్ డెస్క్: ఝార్ఖండ్ రాజధాని రాంచీలో మావోయిస్టుల నెట్‌వర్క్‌కు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. హింసామార్గాన్ని వీడి ప్రజాస్వామ్య వ్యవస్థ పై నమ్మకంతో ఏకంగా 16 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలకు ఆకర్షితులై, భద్రతా బలగాలు చేపట్టిన నిరంతర నిఘా, వ్యూహాత్మక చర్యల ఫలితంగానే వీరు జనజీవన స్రవంతి లోకి వచ్చినట్లు పోలీసులు స్పష్టం చేశారు.

లొంగిపోయిన వారిలో ఆరుగురు అత్యంత కీలక నేతలు కాగా, వీరిపై ప్రభుత్వం రూ. 39 లక్షల మొత్తంలో భారీ రివార్డులను ప్రకటించి ఉంది. తీవ్రమైన విచారణలు, అనేక హింసాత్మక ఘటనలలో వీరికి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లొంగిపోయిన మావోయిస్టులందరికీ తగిన పునరావాస సదుపాయాలు, ఆర్థిక సహాయం అందిస్తామని, శాంతియుత జీవనం సాగించేందుకు పూర్తి సహకారం ఉంటామని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.


ఐజీ (ఆపరేషన్స్), జార్ఖండ్ పోలీస్ నరేంద్ర కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎనిమిది మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో రూ.15 లక్షల రివార్డు ఉన్న ఒక కేంద్ర కమిటీ సభ్యుడు కూడా ఉన్నాడు. మిగిలిన వారిలో ముగ్గురు జోనల్ కమిటీ సభ్యులు, ముగ్గురు సబ్-జోనల్ కమిటీ సభ్యులు, ఆరుగురు ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. ఇది జార్ఖండ్ పోలీసులకు ఒక చారిత్రాత్మక దినం, గొప్ప విజయం. మావోయిస్టు కార్యకలాపాలు దాదాపుగా నిర్మూలించబడ్డాయి. కొందరు ఇంకా చురుకుగా ఉన్నారు. వారిపై నిరంతర ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. వారు వీలైనంత త్వరగా లొంగిపోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. లేకపోతే, ఆపరేషన్ల సమయంలో వారిని హతమార్చడం జరుగుతుంది.” అని మీడియాకు చెప్పుకొచ్చారు.

Next Story