- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీలో ప్రభాస్ స్పిరిట్ షూట్
హైదరాబాద్‌లో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం 'స్పిరిట్' షూటింగ్ వేగం పుంజుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ (Spirit) షూటింగ్ వేగం పుంజుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూట్ హైదరాబాద్‌లోని చారిత్రాత్మక కోఠి ఉమెన్స్ కాలేజీ (చాకలి ఐలమ్మ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం) ప్రాంగణంలో శరవేగంగా జరుగుతోంది. ఈ తాజా షెడ్యూల్‌లో భాగంగా హీరో ప్రభాస్, హీరోయిన్ తృప్తి డిమ్రిల మధ్య వచ్చే కొన్ని కీలకమైన టాకీ పోర్షన్స్ ఇక్కడ చిత్రీకరిస్తున్నారు.
చిత్ర యూనిట్ ఈ చారిత్రాత్మక కాలేజీ ఆవరణను కథకు అనుగుణంగా ఒక ప్రత్యేకమైన సెట్‌గా మార్చడమే కాకుండా, రాత్రి వేళల్లో కూడా కీలకమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని ముఖ్యమైన షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ‘స్పిరిట్’ చిత్రం.. ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున షూటింగ్ జరుపుకుంటుండటంతో ప్రభాస్ అభిమానులలో భారీ అంచనాలు, ఉత్సాహం నెలకొన్నాయి. ఈ షెడ్యూల్ మరికొన్ని రోజుల పాటు ఇక్కడే సాగనుంది.






